ఆరోగ్యానికి అండగా ఆయుష్మాన్ భవ
1 min read– తెల్ల రేషన్ కార్డు కల వారందరూ అర్హులే
– విస్తృతంగా కొనసాగుతున్న ఈ – కేవైసీ
పల్లెవెలుగు వెబ్ వనపర్తి: వనపర్తి జిల్లాలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ లో భాగంగా ఆయుష్మాన్ భవ కార్డుల కోసం ఈ కేవైసీ చేయుటకు కామన్ సర్వీస్ కేంద్రాల ద్వారా పట్టణ గ్రామీణ ప్రాంతాలలో ఈ కేవైసీ నమోదు ముమ్మురంగా కొనసాగుతుందని వనపర్తి జిల్లా కామన్ సర్వీస్ కేంద్రాల జిల్లా మేనేజర్ మహమ్మద్ మాలిక్ తెలియజేశారు.గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రస్తుతము 1886 రకాల రోగాలకు వర్తింపజేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఆయుష్మాన్ కార్డులు మంజూరు చేస్తున్నాయి. ఈ కార్డుల ద్వారా కుటుంబంలో ఎవరైనా దేశంలో ఎక్కడైనా ఐదు లక్షల వరకు ఆరోగ్య సేవలను ప్రభుత్వ మరియు ప్రైవేటు ఆసుపత్రులల ఉచితంగా పొందవచ్చు. వనపర్తి జిల్లాలో మొత్తం ఆహార భద్రత కార్డులు 157150 ఉండగా అందులో 517055 యూనిట్లు ఉన్నాయి. ఇప్పటిదాకా జిల్లాలో 326 కామన్ సర్వీస్ కేంద్రాలు ద్వారా వి ఎల్ ఇ ల ద్వారా 36% పైగా ఈ – కేవైసీ పూర్తి చేశారు.కేంద్ర ప్రభుత్వం ఇప్పటికి ఉన్న మార్గదర్శకాల ప్రకారం ఈ నెల 31 వ తారీఖున 31 వ తేదీని ఆఖరి తేదిగా నిర్ణయించింది. కావున అర్హులైన వారందరూ ఆయుష్మాన్ భవ పథకంలో లబ్ధి పొందుటకు ఈ కేవైసీ పూర్తి చేయించుకోవాలని కామన్ సర్వీస్ కేంద్రాల జిల్లా మేనేజర్ మహమ్మద్ మాలిక్ జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఎండి మాలిక్ సిఎస్సి జిల్లా మేనేజర్ : వివిధ ప్రచార మాధ్యమాల ద్వారా ప్రజలకు విస్తృతమైనటువంటి అవగాహన కల్పించి తెల్ల రేషన్ కార్డు కలిగిన వారందరూ ఆయుష్మాన్ భవ కార్డులు పొందాలని ఈ పథకంలో ప్రతి ఒక్కరు ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలని ఆయన అన్నారు.