NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అయ్యన్నపాత్రుడు అక్రమ అరెస్టు హేయమైన చర్య

1 min read

పల్లెవెలుగు, వెబ్ చెన్నూరు : మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుని సిఐడి పోలీసులు అరెస్ట్ చట్ట విరుద్ధమని చెన్నూరు ఐటీడీపీ ఛాంపియన్ యమల మణికంఠ తీవ్రంగా ఖండించారు.ఈ సందర్భంగా చెన్నూరు లో గురువారం విలేకరులతో మాట్లాడుతూ మునిసిపల్ శాఖకు సంబంధించిన ప్రహరీ గోడకు సిఐడి కి సంబంధం ఏంటి,ఇది ముమ్మాటికి జగన్ రెడ్డి కక్ష సాధింపు,రాష్ట్రంలో జగన్ రెడ్డి ప్రభుత్వం సిఐడి ని అడ్డం పెట్టుకొని టిడిపి నేతలను టార్గెట్ చేసి అక్రమ కేసులు బనాయించి రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడుతుందని అన్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న ఐటీడీపీ, టిడిపి నేతలు, కార్యకర్తలపైనే అక్రమ కేసులు పెట్టే పనిలో సిఐడి అధికారులు పనిచేయడం దుర్మార్గం జగన్ రెడ్డి ప్రభుత్వానికి తొత్తుల వ్యవహరిస్తు అక్రమ కేసులు పెడుతున్న సిఐడి పోలీసుల విధానాలను ప్రజాస్వామిక వాదులు వ్యతిరేకించి ఖండించాలి,ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలపై జగన్ రెడ్డి సాధిస్తున్న కక్ష సాధింపుకు త్వరలో ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయం అన్నారు.

About Author