అంగరంగ వైభవంగా అయ్యప్ప స్వామి గ్రామోత్సవం
1 min read– అయ్యప్ప నామస్మరణతో మారుమోగిన పురవీధులు
– అశ్వమేధ వాహనంపై ఊరేగిన హరిహర సుతుడు
– సాంప్రదాయ దుస్తులలో దీపం పట్టుకున్న మహిళలు, విచిత్ర వేషధారణ, అగ్నిగుండ ప్రవేశం
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు: మండలంలోని రామనపల్లి గ్రామంలో మంగళవారం శ్రీ అయ్యప్ప స్వామి గ్రామోత్సవం ఆలయ నిర్వాహకులు అంగరంగ వైభవంగా నిర్వహించారు, మంగళవారం ఉదయం తెల్లవారుజాము నుండి స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అలంకరణలతో పాటు మధ్యాహ్నం రెండు గంటలకు గ్రామోత్సవం నిర్వహించారు, గ్రామోత్సవంలో మహిళలు సాంప్రదాయ దుస్తులలో దీపాలు వెలిగించి ద్వీప కాంతులతో ప్రత్యేక ఆకర్షణగా నిలవడం జరిగింది, అలాగే విచిత్ర వేషధారణ, అగ్నిగుండ ప్రవేశం, కన్నె స్వాములు కలశంతో పురవీధుల గుండా కరసాము ప్రదర్శన, స్వామివారి గీతాలతో ఆకట్టుకోవడం జరిగింది, ఈ గ్రామోత్సవంలో అయ్యప్ప స్వామి గ్రామంలోని పురవీధుల గుండా అశ్వ వేద వాహనంపై ఊరేగింపుగా రాగా గ్రామస్తులు స్వామివారికి కాయ కర్పూరం అందజేశారు, అనంతరం రాత్రి అయ్యప్ప స్వామి భక్తులు, గ్రామస్తులు అగ్నిగుండం ప్రవేశం, అయ్యప్ప స్వామి కమిటీ సభ్యులు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు. అయ్యప్ప స్వాములకు గ్రామస్తులకు (బిక్ష) అన్నప్రసాదము ఏర్పాటు చేశారు.