బీ.ఏ. రాజు ఇక లేరు..!
1 min read
పల్లెవెలుగు వెబ్: ప్రముఖ సినీ జర్నలిస్ట్, నిర్మాత, పీఆర్వో బీ.ఏ. రాజు కన్నుమూశారు. మధుమేహ వ్యాధితో బాధపడుతున్న ఆయనకు గుండె పోటు రావడంతో హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన మరణించారు. 1500 పైగా సినిమాలకు ఆయన పీఆర్వోగా వ్యవహరించారు. ఆయన భార్య బి. జయ దర్శకత్వం వహించిన సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. చాలా రోజుల పాటు సూపర్ హిట్ అనే సినీ పత్రికను నడిపారు. ఆయన భార్య బి. జయ 2018లో కన్నుమూశారు. బీ.ఏ.రాజుకు ఇద్దరు కుమారులు ఉన్నారు.