బి తాండ్రపాడు గ్రామంలో సివిల్ రైట్స్ డే
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: సోమవారం కర్నూలు జిల్లా బి తాండ్రపాడు గ్రామంలో సివిల్ రైట్స్ డే నిర్వహించడం జరిగింది .ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు కాకర్ల శాంతికుమార్ మాట్లాడుతూ జిల్లాలో ప్రతి నెల 30న జిల్లా కేంద్రం, మండల కేంద్రాల్లో పౌర హక్కుల దినాన్ని నిర్వహించుకోవాలనే చట్టం 1955 వచ్చింది, తద్వారా పౌరులు సమాజంలో వారికున్న హెచ్చుతగ్గులను, అసమానతలను తొలగించుకోవడానికి సివిల్ రైట్స్ డే వీలవుతుందని, అదేవిధంగా ప్రతి ఒక్కరు బాగా చదువుకోవాలని చదువుతోనే సమాజంలో అసమానతలు తొలగిపోతాయని భారత రాజ్యాంగం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి ఇచ్చినటువంటి హక్కులతో సమస్యలు పరిష్కారం చేసుకుందామని తెలిపారు . ఈ కార్యక్రమంలో అదేవిధంగా పంచాయతీ కార్యదర్శి, వీఆర్వో, గ్రామ ఎంపీటీసీ, (dvmc) సభ్యులు రవి శాస్త్రి గారు, ఎరుకల రాజుగారు, సాయి ప్రదీప్ గారు, తదితరులు పాల్గొన్నారు.