NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సబ్బండ వర్గాల సంక్షేమమే B.R.S పార్టీ ధ్యేయం…

1 min read

పల్లెవెలుగు వెబ్ కృష్ణ:    నారాయణ పేట జిల్లా కృష్ణ మండలం తెలంగాణ.నియోజకవర్గాన్ని ప్రగతి పథంలో నడిపించడమే నా లక్ష్యం శ్రీ చిట్టెం రాంమోహన్ రెడ్డి మక్తల్ నియోజకవర్గ ఎమ్మెల్యేనేడు అమరచింత పట్టణ కేంద్రంలో జరిగిన అమరచింత పట్టణ మరియు మండల BRS పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా మక్తల్ ఎమ్మెల్యే శ్రీ చిట్టెం రాంమోహన్ రెడ్డి  తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ ఆంజనేయులు గౌడ్  మఖ్తల్ నియోజకవర్గ శాసనసభ ఎన్నికల బి.ఆర్.ఎస్ పార్టీ ఇంచార్జీ ఉమ్మడి జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యురాలు శ్రీమతి చిట్టెం సుచరిత రాంమోహన్ రెడ్డి  హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ చిట్టెం రాంమోహన్ రెడ్డి  కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమని సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా,ప్రజా సంక్షేమమే లక్ష్యంగా KCR  ఎన్నికల మేనిఫెస్టో రూపొందించిన విషయం తెలిసిందేనని అన్నారు. ఈ సందర్భంగా BRS పార్టీ మేనిఫెస్టో ను వివరిస్తూ ప్రభుత్వ కార్యక్రమాలను,BRS ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని BRS కార్యకర్తలు ఏకమై మరొక్కసారి తమ సత్తాను చాటడానికి సిద్దంగా ఉండాలని పిలుపునిచ్చారు కారు గుర్తుకు ఓటు వేసి మరొక్కసారి BRS పార్టీ ని ఆశీర్వాదించాలని కోరారు ఈ సమావేశంలో అమరచింత పట్టణ మరియు మండల ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ ముఖ్య నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు‌.

About Author