బి.ఎస్.ఏ. కార్యక్రమ గోడ పత్రిక ఆవిష్కరణ
1 min readపల్లెవెలుగు వెబ్ విజయవాడ: ఆదర్శభావాలతో సమాజ హితం కోసం కృషి చేసే వ్యక్తులకు అభ్యుదయ స్వచ్ఛంద సంస్థలు ప్రోత్సాహాన్ని అందించాలని ఉయ్యూరు నగర పంచాయతీ చైర్మన్ వల్లభనేని నాని బి ఎస్ ఏ కార్యక్రమ గోడ పత్రిక ఆవిష్కరణ కార్యక్రమంలో అన్నారు. అటువంటి కృషి చేస్తున్న బహుజన సాహిత్య అకాడమీ సేవలు అభినందనీ యమని ఆయన ప్రశంసించారు.బహుజన సాహిత్య అకాడమీ 3వ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కాన్ఫరెన్స్ మరియు నేషనల్ అవార్డ్స్ 2023 ప్రధానోత్సవ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ను ఉయ్యూరు మున్సిపల్ చైర్మన్ వల్లభనేని సత్యనారాయణ(నాని) శనివారం ఉదయం నగర పంచాయతీ కార్యాలయంలోని ఆయన ఛాంబర్ లో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజులపాటి రామచంద్రరావు,ఉయ్యూరు 16 వ వార్డు కౌన్సిలర్ డాక్టర్ జంపాన పూర్ణిమ లతో కలిసిఆవిష్కరించారు.ఈ నెల 14 సాయంత్రం 5 గంటలకు బహుజన సాహిత్య అకాడమీ స్థానిక బైపాస్ రోడ్ అయ్యప్ప స్వామి గుడి సమీపంలోని గ్రీన్ ల్యాండ్ రిసార్ట్స్ ప్రాంగణంలో స్టేట్ కాన్ఫరెన్స్ ను నిర్వహించ తలపెట్టింది.ఈ సందర్భంగా హాజరయిన అతిధులు పోస్టర్ ఆవిష్కరించిన అనంతరం మాట్లాడుతూ బి.ఎస్.ఏ. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనిపి లుపునిచ్చారు.బహుజన సాహిత్య అకాడమీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు జంపాన శ్రీనివాస్ గౌడ్ తో పాటు బిసి యువనాయకులు జంపాన రవి కుమార్, జంపాన దీపు, బిఎస్ఏ ప్రతినిధులు చింతా రాంబాబు,కాటూరి సురేష్,కె.గౌతమి,కోలా దుర్గా భావాని ,నారగాని రజని, తదితరులు పాల్గొన్నారు.