PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బి. ఎస్ .ఏ .కార్యక్రమం పోస్టర్ హైదరాబాదులో ఆవిష్కరణ

1 min read

పల్లెవెలుగు వెబ్ ఉయ్యూరు: బహుజన సాహిత్య అకాడమీ ఆంధ్రప్రదేశ్ విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 14వ తేదీన కృష్ణాజిల్లా ఉయ్యూరులో నిర్వహించ తలపెట్టిన బహుజన సాహిత్య అకాడమీ 3వ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కాన్ఫరెన్స్ మరియు నేషనల్ అవార్డ్స్ పంపిణీ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ను ఏప్రియల్ 2 న ఆదివారం హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన భవన్ లో బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షులు నల్లా రాధాకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన బి.ఎస్.ఏ తెలంగాణ స్టేట్ 6 వ కాన్ఫరెన్స్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన అభ్యుదయవాది, విప్లవ గాయని అరుణోదయ అధ్యక్షురాలు కామ్రేడ్ విమలక్క, ఆవిష్కరించారు. కార్యక్రమంలో బహుజన సాహిత్య అకాడమీ తెలంగాణ అధ్యక్షులు రాష్ట్ర ఎం ఎం గౌతమ్ ఆంధ్రప్రదేశ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జంపాన శ్రీనివాస్ గౌడ్ తదితర బిఎస్ఏ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

About Author