భావి భారత నిర్మాణంకు బాటలు వేసిన డాక్టర్:బాబు జగజీవన్ రావు
1 min read
బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి నివాళులు అర్పించిన జిల్లా కలెక్టర్ సిహెచ్ నాగరాణి
పశ్చిమగోదావరి జిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : డాక్టర్ బాబు జగజీవన్ రావ్ విగ్రహానికి నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ నాగరాణి(ఉండి) బాబు జగ్జీవన్ రామ్ భావి భారతదేశానికి బాటలు వేశారని స్వతంత్ర పోరాట యోధునిగా బీహార్ శాసనసభ్యుడు గా , పార్లమెంట్ సభ్యునిగా,మూడు నాలుగు దశాబ్దాలు కేంద్ర మంత్రిగా,ఉప ప్రధానిగా పదవులు నిర్వహించి భారత దేశ సర్వతోముఖాభివృద్ధికి తన జీవితం అంకితం చేశారని పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆయనకు నివాళులర్పించారు. కాళ్ళ మండలం వేంపాడు గ్రామంలో అరుంధతిపేట వద్ద బాబు జగజీవన్ రామ్ విగ్రహం వద్ద శనివారం నిర్వహించిన జయంతి కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగరాణి మాట్లాడుతూ జగజ్జీవన్ రామ్ జయంతిని సమానత్వ దినోత్సవం గా జరుపుకుంటామన్నారు. గాంధేయ వాదిగా స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న జగజ్జీవన్ రామ్ కుల వ్యవస్థకు వ్యతిరేకంగా సమానత్వం కోసం సమ సమాజం కోసం ఉద్యమించారన్నారు. చిన్న వయసు నుండి ఎంతో చైతన్యంతో ఉన్నత విద్యాభ్యాసం చేశారన్నారు.దేశం ఆహార సంక్షోభం, ఆహార కొరత ఎదుర్కొన్న పరిస్థితుల్లో వ్యవసాయ శాఖ మంత్రిగా హరిత విప్లమునకు బాటలు వేసి దేశంలో వ్యవసాయరంగమును విస్తరించి గణనీయంగా ఆహార ఉత్పత్తులను పెంచారన్నారు. కరువు కాటకాలు ఆకలి మంటలను నివారించారన్నారు. ఆయన ఆయన బాట లోనే ఆయన కుమార్తె మీరాకుమారి పయనించి లోక్ సభ స్పీకర్ గా పనిచేశారన్నారు . జగజీవన్ రామ్ ను స్ఫూర్తిగా,ఆదర్శంగా తీసుకొని అందరూ ముందుకెళ్లాలన్నారు.. ఈ సందర్భంగా గంగరాజు మాట్లాడుతూ తమ ఎస్సీ కాలనీలో రోడ్లు డ్రైన్లు లేవని వాటి నిర్మాణానికి సహకారం అందించవలసిందిగా కలెక్టర్ నాగరాణికి విజ్ఞప్తి చేశారు కలెక్టర్ కు గ్రామ సర్పంచ్ యిర్రింకి పద్మావతి దంపతులు, కార్యదర్శి సుందర వెంకటేష్ ఎండిఓ జి .స్వాతి తహసిల్దార్ గొల్లమందల సుందర్ సింగ్, ఈవో పిఆర్ ఆర్డీ భాస్కర రావు, విగ్రహ దాత వేగేశ్న సీతారామరాజు, మాజీ సర్పంచ్ వీరమల్లు బోస్ వీరమల్లు వేణు ,కోపల్లె ఉపసర్పంచ్ బూడి పరాలు తదితరులు కలెక్టర్ కు స్వాగతం పలికారు.
