PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అణగారిన వర్గాల ఆశాజ్యోతి బాబు జగ్జీవన్ రామ్

1 min read

నందికొట్కూరు లో ఘనంగా 117వ జయంతి వేడుకలు..

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు:  అణగారిన వర్గాల ఆశాజ్యోతి , మొట్ట మొదటి దేశ ఉప ప్రధాని, కుల నిర్మూలన పోరాట యోధుడు, కార్మికుల పక్షపాతి బాబు జన్జీవన్ రామ్ అని ఎమ్మార్పీఎస్ జిల్లా కో కన్వీనర్ లింగాల స్వాములు మాదిగ ,ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎం.రమేష్ బాబు, ఎమ్మార్పీఎస్ నందికొట్కూరు తాలూకా ఇన్చార్జి డాక్టర్ రాజు, ఎం ఈ ఎఫ్ నాయకులు పల్లె గాంధీ  అన్నారు.శుక్రవారం పట్టణంలో బాబు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పులా మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాబు జగజ్జీవన్ రామ్ ఆశయ సాధన కోసం ప్రతిఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు.  కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు మల్యాల నాగరాజు, ఏసన్న,, సురేష్, బీసీ సంఘం నాయకులు శ్రీనివాసయాదవ్, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు వెంకటేశ్వర్లు , దళిత సంఘం నాయకులు జాన్ తదితరులు పాల్గొన్నారు.

About Author