సామాజిక సమానత్వ సాధనలో బాబు జగ్జీవన్ రామ్ కృషి చిరస్మరణీయం
1 min read
లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్.
కర్నూలు, న్యూస్ నేడు: భారత దేశ స్వాతంత్ర్య సమరయోధుడు, సామాజిక న్యాయ పోరాట యోధుడు, భారత రాజకీయం లో చిరస్మరణీయ స్థానాన్ని సంపాదించిన బాబు జగ్జీవన్ రామ్ జయంతిని ప్రతి ఒక్కరూ ఘనంగా జరుపుకోవాలని లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూలు మెల్విన్ జోన్స్ ప్రతినిధి , నైస్ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. బాబు జగ్జీవన్ రామ్ జయంతి ని పురస్కరించుకొని స్థానిక నైస్ కంప్యూటర్స్ కార్యాలయంలో లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు విద్యార్థులు విద్యార్థులు బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలను అలంకరించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ సామాజిక సమానత్వం కోసం చేసిన పోరాటం, అణగారిన వర్గాల కోసం నిర్వహించిన సేవలు చిరకాలం నిలిచే ఉంటాయని,బాబు జగ్జీవన్ రామ్ భారత స్వాతంత్ర్య ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించడమే కాకుండా, స్వతంత్ర భారత దేశంలో కేంద్ర మంత్రిగా పదవులు నిర్వహించి దేశ అభివృద్ధికి ఎనలేని సేవలు అందించడమే కాకుండా వ్యవసాయ శాఖ, రక్షణ శాఖ వంటి కీలక విభాగాల్లో ఆయన చేసిన సేవలు మరువలేనివి అని అత్యంత నిబద్ధతతో, సమాజం పట్ల ఉన్న బాధ్యతతో ఆయన అందించిన సేవలు ప్రతి భారతీయునికి ప్రేరణాత్మకంగా నిలుస్తాయి అన్నారు. కార్యక్రమంలో కర్నూల్ మెల్విన్ జోన్స్ సభ్యులు, నైస్ స్వచ్ఛంద సేవా సంస్థ కార్యకర్తలు ,విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.