NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బాబు.. దుర్మార్గపు రాజకీయాలు మానుకో..

1 min read

– వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మలిశెట్టి వెంకటరమణ
పల్లెవెలుగు వెబ్​, చిట్వేలు: కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా టిడిపి దుర్మార్గపు రాజకీయం చేయడం మానుకోవాలని వైయస్సార్సీపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మల్లి శెట్టి వెంకటరమణ హితవు పలికారు. కరోనా కట్టడికి సీఎం వైఎస్​ జగన్​ కీలక నిర్ణయాలు తీసుకుంటూ.. దేశానికే ఆదర్శంగా నిలిచారని, కానీ చంద్రబాబు రాజకీయాలు చేసి లబ్ధిపొందాలని చూడటం సిగ్గు చేటన్నారు. ఓవైపు టెస్టులు చేయిస్తూ, మరోవైపు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చురుగ్గా చేపడుతున్నారని అన్నారు. అలాగే ఎక్కడికి అక్కడ కరోనా క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేసి అక్కడే వైద్యం అందేలా చేశారని, అవసరమైన వారికి ఆక్సిజన్ బెడ్లు కేటాయిస్తున్నారన్నారు. రాయచోటి, రాజంపేట, కోడూరు అసెంబ్లీ నియోజక వర్గాలలో ఆక్సిజన్ ప్లాంట్స్, బెడ్స్ ఏర్పాటు, వెంటిలేటర్ బెడ్స్, ఇతరత్రా కోవిడ్ బాధితుల,కోవిడ్ సేవల నిమిత్తం రూ 2 కోట్ల నిధులు అందించారని, మరో రూ. కోటి అందిస్తామని ఎంపి మిథున్ రెడ్డి చెప్పడం అభినందనీయమన్నారు. ప్రజలను మభ్య పెట్టడమే చంద్రబాబుకు పనిగా పెట్టుకున్నారని విమర్శించిన వెంకటరమణ… ఏమాత్రం మానవత్వం ఉంటే ప్రజలను భయభ్రాంతులకు గురి కాకుండా మంచి సలహాలు సూచనలు ఇవ్వాలని కోరారు.

About Author