NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బాబు నీ తాట తీస్తా.. ఫోర్ ట్వంటీ వెధ‌వ !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : సీఎం జ‌గ‌న్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చంద్రబాబు తాటతీస్తాన‌ని మంత్రి కొడాలి నాని అన్నారు. తాటతీసి మా నాయ‌కుడికి చెప్పులు కుట్టిస్తాన‌ని నాని చెప్పారు. చంద్రబాబు ఫోర్ ట్వంటీ వెధ‌వ అని, ప‌ట్టాభి పెయిడ్ ఆర్టిస్ట్ అని అన్నారు. ప‌ట్టాభితో చంద్రబాబు ఇష్టానుసారం మాట్లాడిస్తున్నాడ‌ని అన్నారు. జీతం కోసం ప‌నిచేసే ప‌ట్టాభి.. చంద్రబాబు రాసిచ్చింది చ‌దువుతాడ‌ని అన్నారు. అలాంటి వాడిని ప‌ట్టించుకోమ‌ని చెప్పారు. ప‌ట్టాభి వ్యాఖ్యల‌పై నిల‌దీసేందుకు కొంద‌రు అభిమానులు టీడీపీ కార్యాల‌యానికి వెళ్లార‌ని, నాలుగు కుర్చీలు విరిగితే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎందుకు బాధ‌ప‌డుతున్నార‌ని అన్నారు. పోసాని ముర‌ళీకృష్ణ ఇంటి పై దాడి జ‌రిగితే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎందుకు ఖండించ‌లేద‌న్నారు.

About Author