బాబు వెన్నుపోటుకు బలైన RRR
1 min read– వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మలిశెట్టి వెంకటరమణ
పల్లెవెలుగు వెబ్, కడప : చంద్రబాబు వెన్నుపోటు చరిత్ర తెలిసి కూడా రఘురామకృష్ణరాజు ఆయన వలలో చిక్కుకుని ఇప్పుడు విలవిలలాడిపోతున్నారని వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మలిశెట్టి వెంకటరమణ ఎద్దేవ చేశారు. ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెంకటరమణ మాట్లాడారు. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు బాధ్యతగా ప్రవర్తించాల్సిందిపోయి… కులాలపై , ప్రభుత్వంపై విద్వేష పూరిత వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. చంద్రబాబు నాయుడు ప్లాన్‌కు.. RRR బలైపోయాడన్నారు. కరోన పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైరస్ నివారణకు ఎంతో కృషి చేస్తున్నారని, అలాంటి సీఎంపై ఆరోపణలు చేస్తూ వెటకారంగా మాట్లాడాటం సిగ్గుచేటన్నారు.