NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రాష్ట్రం బాగుండాలంటే బాబు మళ్లీ రావాలి

1 min read

జగన్ రెడ్డి అరాచక పాలనను వ్యతిరేకిస్తున్న ప్రజలు

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: రాబోయే ఎన్నికల్లో భారీ ఓటమితో వైసిపి పార్టీ ప్రజాక్షేత్రం నుండి తుడిచిపెట్టుకు పోయేలా బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర ఎస్సీ సెల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ గిత్త జయసూర్య అన్నారు. బుధవారం మండల కేంద్రం పగిడ్యాల లో  బాబు ష్యురిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ ప్రకటించిన ఆరు గ్యారంటీ పథకాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా జయసూర్య మాట్లాడుతూ  అవినీతి అక్రమాలతో నిండిపోయిన అసమర్ధ, అహంకార ముఖ్యమంత్రి వైఎస్ జగన్  పాలనతో విసిగిపోయిన వైసిపి నాయకులు కార్యకర్తలు ప్రజలు స్వచ్ఛందంగా టిడిపిలో చేరుతున్నారని తెలిపారు. టిడిపి హయాంలో చేసిన నియోజకవర్గ అభివృద్ధిని గుర్తు తెచ్చుకున్న ప్రజలు టిడిపికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నారని వివరించారు.కార్యక్రమంలో టీడీపీ నాయకులు మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి, పుల్యాల  వాసు రెడ్డి,యూనిట్ ఇంచార్జ్ దామోదర్ రెడ్డి,ఓగిలి శ్రీనివాసులు,పగడం శేఖర్ , పాండు, షాతన్ బాబు, శ్రీను, వెంకటేశ్వర్లు,గుండెపోగు బాబు,ప్రభాకర్ ,చెన్నకేశవులు,సునీల్ జెనసేన కర్నాటి మల్లికార్జున బీరవోలు సుగూరు శివన్న, హనుమన్న,నాగేంద్ర,లింగన్న, గిడ్డయ్య,శ్రీను,ఎల్లస్వామి, సంకిరేణిపల్లి మచ్చ శ్రీనివాసులు, ఎల్లయ్య,ముత్తు,రాముడు, చిట్టిబాబు,గోవిందు,రాజు,విజయ్,చరణ్ , విజేయుడు,పగడం స్వాములు,మేకల శ్రీను,సున్నంపల్లి శ్రీనివాసులు, చిన్న నాగలక్ష్మయ్య,జమీల్ , తదితరులు పాల్గొన్నారు.

About Author