బాబు ష్యూరిటి.. భవిష్యత్తు గ్యారెంటీ ప్రచారం
1 min read– 25వ రోజుకు చేరిన టిడిపి రిలే నిరాహార దీక్షలు
పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టు రిమాండ్ ను నిరసిస్తూ పత్తికొండ నియోజకవర్గంలో చేపట్టిన టిడిపి రిలే నిరాహార దీక్షలు 25వ రోజుకు చేరుకున్నాయి. శనివారం దీక్షా శిబిరాన్ని టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి శ్యామ్ కుమార్, టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు కే సాంబశివారెడ్డి ప్రారంభించారు. ముందుగా పత్తికొండ నియోజకవర్గంలోని మద్దికేర మండలం పెరవలి గ్రామంలో బాబుని అక్రమ అరెస్టు చేసినందుకు ఒక నియంత పై బాబుతో నేను అనే స్ఫూర్తితో ఇంటింటికి వెళ్లి వారితో స్కిల్ డెవలప్మెంట్ స్కాం లో ఆరోపణలు వాస్తవాలు ఏంటి అని పాంప్లెట్లను ఇస్తూ బాబు అక్రమ అరెస్టును గురించి వారికి వివరిస్తూ అలాగే బాబు ష్యూరిటి భవిష్యత్తు గ్యారెంటీ* తెలియజేస్తూ ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిడిపి టిడిపి నాయకులు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ బత్తిని వెంకటరాముడు, రామానాయుడు, మనోహర్ చౌదరి, లక్ష్మీనారాయణ చౌదరి, ఈశ్వరప్ప, నౌనే పాటి, సింగం శ్రీనివాసులు, మీరా హుస్సేన్ అశోక్ కుమార్ తిరుపాలు, బత్తిని లోకనాథ్ కోసూరు శ్రీనివాసులు, పెద్దహుల్తి, తిప్పన్న, శ్రీనివాసులు గౌడ్ మాజీ జడ్పిటిసి సభ్యులు పి శ్రీనివాసులు బిటి. గోవిందు, గోవింద గౌడ్, సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. అలాగే రిలే నిరాహార దీక్షలో పెరవలి గ్రామం ముఖ్యనాయకులు, గ్రామస్తులు కూర్చున్నారు. యూనిట్ &బూత్ ఇంఛార్జ్ లు, వార్డ్ నాయకులు పాల్గొన్నారు.