NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివెముల:  గడివేముల మండలంలోని బిలకల గూడూరు  గ్రామంలో శనివారం రాత్రి టీడీపీ నాయకులు ఎస్ఎ రఫీక్, సుదర్శన్ రెడ్డి లు పర్యటించారు ‘బాబు ష్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారెంటీ’ కార్యమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని మహిళలకు టీడీపీ ప్రవేశపెట్టిన మిని మానిఫెస్టోలోని అంశాలపై అవగాహన కల్పించారు. తల్లికి వందనం ద్వారా ఇంట్లో చదువుతున్న ప్రతి ఒక్కరికి ఏటా 15వేలు, ఆడబిడ్డ నిధి ద్వారా ప్రతినెలా 1500, అన్నదాతలకు ఏటా 20వేలు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, నిరుద్యోగ యువతకు యువగళం ద్వారా ఉద్యోగాల కల్పన, దీపం పథకం ద్వారా ఏటా మూడు సిలెండర్ల ను ఉచితంగా అంద జేస్తారన్నారు. గ్రామప్రజలకు ష్యూరిటీ బాండ్లను అందజేశారు. వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ గెలుపు ఖాయమని, అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ గెలుపు భావితరాల భవిష్యత్తుకు చాలా అవసరమని  వారు అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ యువ నాయకులు యస్ ఏ ఖలీద్, జయప్రకాష్ రెడ్డి, జయంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About Author