PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పాతపాడు గ్రామంలో దారుణం

1 min read

– మహిళపై ఆగంతకుడు దాడి.. తలపై బలంగా కత్తిపోట్లు
– బంగారు ఆభరణాలు దోచుకపోయిన ఆగంతకుడు
– మహిళను చికిత్స కోసం హుటాహుటిన కర్నూలు తరలింపు
పల్లెవెలుగు, వెబ్ బనగానపల్లె : మండలం పాతపాడు గ్రామంలో శనివారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో కుమారస్వామి అనే వ్యక్తి ఇంట్లోకి గుర్తుతెలియని వ్యక్తి ప్రవేశించి ఇంట్లో ఉన్న మహిళపై కత్తితో దాడి జరిపాడు. తలపై కత్తితో తీవ్రంగా గాయపరచి ఆమె మెడలో ఉన్న బంగారు ఆభరణాలు దోచుకున్నట్లు సమాచారం అందింది. తలపై సుమారు మూడుకు పైగా కత్తిపోటు గాయాలు కావడంతో ఆమెను వెంటనే అంబులెన్స్లో చికిత్స నిమిత్తం కర్నూల్ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలిసివెంటనే బనగానపల్లె పోలీసుసులు పాతపడు వెళ్లి దర్యాప్తు చేపట్టారు.

About Author