PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దారుణంగా ట్రోల్ చేసిన నెటిజ‌న్.. రిప్లై ఇచ్చిన స‌మంత !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : స‌మంత‌, నాగచైత‌న్య విడాకులు తీసుకున్న‌ప్ప‌టికీ .. సోష‌ల్ మీడియాలో వారిపై చ‌ర్చ మాత్రం ఆగ‌డంలేదు. ఎవ‌రికి తోచిన‌ట్టు వారు కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా ఓ నెటిజ‌న్ స‌మంత‌ను దారుణంగా ట్రోల్ చేస్తూ ట్వీట్ చేశారు. విడాకులు తీసుకున్న ఓ సెకండ్‌ హ్యాండ్‌ ఐటెం అంటూ దారుణంగా దూషించాడు. అంతేకాకుండా జెంటిల్మెన్(నాగ చైతన్య) నుంచి అప్పనంగా రూ. 50కోట్లు దోచుకుందంటూ ట్వీట్‌ చేశాడు. దీని పై స్పందించిన స‌మంత నిన్ను ఆ దేవుడు చల్లగా దీవించుగాక అంటూ తనదైన స్టైల్‌లో సమాధానమిచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది

                         

About Author