PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సీఎం . వైఎస్ జగన్

1 min read

– ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు: బడుగు బలహీన వర్గాలకు అత్యున్నత స్థాయి కల్పించి వారికి రాజకీయ ఆర్థిక సంక్షేమంలో పెద్ద పీట వేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కిందని, గతంలో ఎన్నడు లేని విధంగా బడు,బలహీన వర్గాలైన బిసి,ఎస్సి,ఎస్టి,మైనారిటీలను వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవడం జరిగిందని ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్ అన్నారు, శనివారం ఆయన స్థానిక ఎంపీపీ కార్యాలయంలో వైఎస్ఆర్సిపి బీసీ నాయకులతో కలసి విలేకరులతో మాట్లాడారు, అనాదిగా రాజకీయాలలో వస్తున్న ఈ దురాచారాన్ని రూపుమాపి నా బిసి….నాఎస్సి….నా ఎస్టి….నా మైనారిటీ అంటూ రాష్ర్ట ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి బలహీన వర్గాలకు ఇచ్చిన నినాదం, నేడు రూపు దాల్చి సంచలనమైందని ఆయన పేరు కొన్నారు, రాష్ట్ర రాజకీయాలలో ఏ నాయకుడైనా ఒక మాట చెబితే దాటవేస్తాడేమో కానీ, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటకు కట్టుబడి, బీసీలు అంటే బ్యాక్ వార్డ్ కాస్ట్ కాదని, బ్యాక్ బోన్ అని నిరూపించడం జరిగిందన్నారు, ఇందుకు సాక్ష్యమే నేడు ఎమ్మెల్సీలకు ఇచ్చిన ప్రాధాన్యత అని ఆయన తెలియజేశారు, దీని పై ప్రతిపక్ష నాయకులు వ్యంగ్యబాణాలు సంధించారని వారందరి విమర్శలను తన ఆచరణీయమైన చేతల ద్వారా ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పటాపంచలు చేసి వారంతా మారు మాట్లడకుండా ముక్కున వేలేసుకునేలా చేయడం జరిగిందన్నారు, ఇది బడుగు,బలహీన వర్గాలకు పండుగ రోజని ఆయన తెలియజేశారు, సంస్కృతి సంప్రదాయాల పండుగలు వస్తుంటాయని,కాని చరిత్ర సృష్టించే వ్యక్తులు చేసే పనులు తర్వాతి కాలంలో కూడా సంప్రదాయాలుగా మారతాయని తెలియజేశారు,. చట్టసభలలో ఎన్నడూ అడుగుపెట్టని కొన్ని కులాలకు చెందిన వ్యక్తులను,మహిళలను శాసనమండలి స్దానాలకు వైయస్సార్ సిపి అభ్యర్దులుగా ఎంపిక చేయడం గొప్ప సాహసమేనని ఆయన అన్నారు, అంబేద్కర్ ,జ్యోతిరావుపూలలే ,జగజ్జీవన్ రామ్,లాంటి మహనీయుల వర్ధంతులు,జయంతులు ,సందర్బంగా మాత్రమే ఒకప్పుడు రాజకీయనేతలనుంచి బడుగు,బలహీనవర్గాలకు రాజ్యాధికారం అనే మాటలు వినిపిస్తుండేవని,ఇక నుండి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం ఇవ్వబడింది అనేలా చరిత్రను తిరగరాసిన ఘనత ముఖ్యమంత్రి వైయస్ జగన్ రెడ్డి దే నని ఆయన కొనియాడారు, దీనినే నెటిజన్ల భాషలో చెప్పాలంటే ట్రెండ్ ఫాలో అయ్యేవారికంటే, ట్రెండ్ సెట్ చేసేవాళ్లే ప్రజల దృష్టిలో హీరోలు గా ఉంటారని ఆ పదానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, ముందువరసఉన్నారనిఆయనతెలిపారు, బడుగు,బలహీనవర్గాలకు రాజ్యాధికారం విషయంలో తనదైన ట్రెండ్ సెట్ చేశారని,ఆ ట్రెండ్ ను నలభై ఏళ్ళ రాజకీయ జీవితం ఉండి బిసిలను ఓటుబ్యాంక్ గా వాడుకున్న చంద్రబాబు అయినా కొత్తగా రాజకీయాలలోకి వచ్చిన పవన్ కల్యాణ్ అయినా మరొకరైనా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఫాలో అవ్వాల్సిందేననిఆయన తెలిపారు, చంద్రబాబు నాయుడు సాక్షాత్తు ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు ఎవరైనా ఎస్సీ, ఎస్టీ, లుగా పుట్టాలనుకుంటారా.. అన్నటువంటి చంద్రబాబు నాయుడు తన రాజకీయజీవితంలో బీసీలను ఓటుబ్యాంకుగా వాడుకుని వదిలేశారని తెలియజేశారు, నేడు జడ్పీ ఛైర్మన్ లుగా 13 మందిలో 69 శాతం మంది అంటే 9 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల వారే ఉండడం అదేవిధంగా నగర మేయర్లుగా 14 మంది ఉంటే అందులో 86 శాతం మందిని ఆ వర్గాల వారినే ఎంపిక చేయడం జరిగిందన్నారు, 87 మున్సిపల్ ఛైర్మన్ లు ఉండగా… 84 స్థానాలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపొందితే, వాటిలో 73 శాతం మందిని ఆ వర్గాల వారినే ఎంపిక చేశారని తెలియజేశారు, 648 మండలాలకు గాను 637 ఎంపీపీ లను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటే వారిలో 431 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఉన్నారని అలాగే 137 కార్పొరేషన్ ఛైర్మన్లుకు సంబంధించి 58 శాతం ఆ వర్గాలకే కేటాయించడం జరిగిందని ఆయన అన్నారు,484 మంది డైరెక్టర్ పదవులలో 280 మంది (58 శాతం) ఆ వర్గాల వారికి ఇవ్వడం జరిగిందని తెలియజేశారు, ఇవిగాక బీసీ కులాలకు సంబంధించి 56 కార్పొరేషన్లను, ఎస్సీలకు మరో ౩ కార్పొరేషన్లు, ఎస్టీలకు మరో కార్పొరేషన్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసి 684 డైరెక్టర్ల పదవులలో ఆయా వర్గాల వారిని నియమించడం జరిగిందని ఆయన అన్నారు, ఇంత పెద్ద ఎత్తున సామాజిక న్యాయానికి,బడుగు,బలహీన వర్గాల సాధికారతకు చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ను వైయస్ జగన్మోహన్ రెడ్డి సమూల మార్పు చేయడం జరిగిందని ఆయన తెలియజేశారు, గతంలో చంద్రబాబు నాయుడు బిసిల తోకలు కత్తిరిస్తాననడం… ఎస్సిలుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా…. తాట తీస్తానని.. తోలు వలుస్తానని మత్స్య కారులను బెదిరించడం జరిగిందని అలాంటివారు నేడు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ లపై కపట ప్రేమ చూపడం ఎంతవరకు సబబని ఆయన ప్రశ్నించారు, ఇంత పెద్ద ఎత్తున బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు అగ్రపీఠం చేసిన ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కి మద్దతుగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఉన్నారని ఆయన తెలియజేశారు, ఈ కార్యక్రమంలో రాష్ట్ర తొగట వీర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ మడక విజయలక్ష్మి, సర్పంచ్ టి సి డి చంద్ర ,వైఎస్ఆర్సిపి నాయకులు జగన్నాథం, మడక వెంకటసుబ్బయ్య, మాజీ సర్పంచ్ శేఖర్, మాజీ ఎంపీటీసీ నరసయ్య యాదవ్, డాక్టర్ పిచ్చయ్య, తదితరులు పాల్గొన్నారు.

About Author