బద్వేల్ ఉపఎన్నిక: ఒంటిగంట వరకు 35.47 శాతం పోలింగ్
1 min read
పల్లెవెలుగు వెబ్: బద్వేల్ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 35.47శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 7 గంటల వరకు కొనసాగనుంది. బద్వేలు ఉప ఎన్నికను వెబ్ కాస్టింగ్ ద్వారా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి విజయానంద్ పరిశీలిస్తున్నారు. 281 పోలింగ్ కేంద్రాల్లోనూ వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఉప ఎన్నిక ప్రశాంత వాతారణంలో జరుగుతోందని..ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదన్నారు. దొంగ ఓట్లు వేస్తున్నారన్న ప్రచారం అవాస్తమని విజయానంద్ కొట్టిపారేశారు.
ఇక, తెలంగాణలోని హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 45.63శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాట్లు చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులుదీరారు.