PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బ‌ద్వేల్ ఉపఎన్నిక మ‌ళ్లీ జ‌ర‌పాలి.. అభ్యర్థి ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష !

1 min read

పల్లెవెలుగు వెబ్​ :బ‌ద్వేల్ ఉప ఎన్నికలో అక్రమాలు జ‌రిగాయంటూ ఓ అభ్యర్థి ఆమ‌ర‌ణ‌ నిరాహార దీక్షకు దిగారు. బ‌ద్వేల్ లో మ‌ళ్లీ ఉప ఎన్నిక‌లు నిర్వహించాలంటూ స్వతంత్ర అభ్యర్థి బూర‌గ ర‌త్నం నిరస‌న‌కు దిగారు. భారీ స్థాయిలో దొంగ ఓట్లు వేశార‌ని, అక్రమాలు జ‌రిగాయ‌ని ఆరోపించారు. ఆర్వో, జిల్లా ఎన్నిక‌ల అధికారి దృష్టికి తీసుకెళ్లినా ప‌ట్టించుకోలేద‌ని ఆరోపించారు. బ‌ద్వేల్ లోని బాలాజీ విహార్ వ‌ద్ద ఆయ‌న దీక్షకు దిగారు. దౌర్జన్యాల‌తో వైకాపా గెలిచింద‌న్నారు. తిరిగి ఉప ఎన్నిక నిర్వహించే వ‌ర‌కు ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష కొన‌సాగుతుంద‌ని తెలిపారు.

About Author