రిలయన్స్ నుంచి బాహుబలి ఐపీవోలు !
1 min read
పల్లెవెలుగువెబ్ : రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి రెండు మెగా ఐపీఓలు రాబోతున్నాయి. ఐపీఓ ద్వారా రిలయన్స్ జియో రూ.50,000 కోట్లు, రిలయన్స్ రిటైల్ వెంచర్స్ రూ.75,000 కోట్ల సమీకరణకు రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఆర్‌ఐఎల్ వాటాదారుల వార్షిక సర్వసభ్య సమావేశంలో అంబానీ ఈ రెండు మెగా ఐపీఓల వివరాలు ప్రకటిస్తారని మార్కెట్ వర్గాల అంచనా.