బహుజన సాహిత్య అకాడమీ పోస్టర్ ఆవిష్కరణ
1 min readపల్లెవెలుగు వెబ్ విజయవాడ : సమాజ వికాసానికి దోహదపడే కళా సాంస్కృతిక సాహిత్య రంగాలలో బహుజనుల ప్రతిభ పాటవాలకు మరింత గుర్తింపు ప్రోత్సాహం అవసరమని ఏ.పీ ఎస్సీ కమిషన్ చైర్మన్ మారుమూడి విక్టరీ ప్రసాద్ బహుజన సాహిత్య అకాడమీ పాస్టర్ ఆవిష్కరణలో అన్నారు. ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూ ఉన్నత సామాజిక మార్పు బహుజన అభ్యున్నతితో పాటు సాహిత్యం కళలుఅవసరమని అటువంటి చైతన్యాన్ని తీసుకువచ్చేందుకు బహుజన సాహిత్య అకాడమీ జాతీయ స్థాయిలో చేస్తున్న కృషి ప్రశంసనీయమని ఆయన అన్నారు ..బహుజన సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో ఏప్రిల్ 14న ఉయ్యూరులో నిర్వహించు తలపెట్టిన బి.ఎస్.ఏ నేషనల్ అవార్డ్స్- 2023 కార్యక్రమం పోస్టర్ సోమవారం ఆయన ఆవిష్కరించారు .భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 124వ జయంతి రోజున ప్రపంచ జ్ఞాన దినోత్సవం సందర్భంగా ఉయ్యూరు బైపాస్ రోడ్ లోని గ్రీన్ ల్యాండ్ రిసార్డ్స్ ఆవరణలో బహుజన సాహిత్య అకాడమీ ఎంపిక చేసిన వివిధ రంగాలలోని విశేష సేవలు అందించిన వ్యక్తులకు అవార్డులను అందజేయమందుని ,ఆ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు బీసీ హక్కుల ఉద్యమ నిర్మాత ఆర్.కృష్ణయ్యతోపాటు పలువురు ప్రజాప్రతినిధులు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు, వివిధ రంగాల ప్రముఖులు హాజరవుతున్నారని బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షులు నల్లా రాధాకృష్ణ ,నేతృత్వంలో బిఎస్ఏ ఆంధ్ర ప్రదేశ్ విభాగం అధ్యక్షులు జంపాన శ్రీనివాస్ గౌడ్ ,పర్యవేక్షణలో ఈ కార్యక్రమం విస్తృతస్థాయిలో జరగనుంది అని ఈ కార్యక్రమంలోజంపాన శ్రీనివాస్ గౌడ్ ,ప్రతినిధులు కే సురేష్, కాటూరు గౌతమి,, కోలా దుర్గాభవాని, నారా గాని రజిని, తదితరులు పాల్గొన్నారు.