బహుజన రాజ్యాధికారం సాధించాలి..
1 min readకంచికచర్ల ఎంపీటీసీ బర్రే ఉదయ్ కిరణ్ పిలుపు..
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : ఏలూరు కొత్త రోడ్లో గల నవసమాజ్ సొసైటీ కార్యాలయంలో ఉమ్మడి కృష్ణా జిల్లా కంచికచర్ల ఎంపీటీసీ బీఎస్పీ పార్టీ అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందిన బర్రే ఉదయ్ కిరణ్ నుఘనంగా సత్కరించి సన్మానం చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఉదయ్ కిరణ్ మాట్లాడుతూ ఆధిపత్య కులాల పార్టీ లతో సంబంధం లేకుండా బీఎస్పీ పార్టీ తరపున పోటీ చేసి ఎంపీటీసీ గా గెలుపొందానని రాబోయే 2024 ఎన్నికల్లో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ లందరూ ఒక్కటై బహుజన రాజ్యాధికారం సాధించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ (బీఎస్పీ) పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నేతల రమేష్ బాబు , దెందులూరు నియోజకవర్గ ఇన్చార్జి కర్రే అంబేద్కర్, భూపతి అప్పారావు, ఎల్ఐసి రాజా తదితరులు పాల్గొన్నారు.