NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బెయిల్ బ్యాచ్ నీతులు వ‌ల్లిస్తున్నారు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : బెయిల్ బ్యాచ్ అంతా క‌లిసి నీతులు వ‌ల్లిస్తున్నట్టు ఉంద‌ని వైసీపీ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణరాజు ఎద్దేవా చేశారు. గృహ హింస కేసులో నిందితుడిగా తేలిన ఏపీ సీఐడీ డీజి సునీల్ కుమార్.. మ‌రో ఇద్దరు నిందితుల‌తో క‌లిసి తోడు దొంగ‌ల్లా వ్యవ‌హరిస్తున్నార‌ని ఆరోపించారు. ఈ బాగోతం పై స‌రైన స‌మ‌యంలో పూర్తీ వివ‌రాల‌తో 420 చ‌ట్టం కింద ఫిర్యాదు చేస్తాన‌ని తెలిపారు. సీబీఐ విచార‌ణ‌లో అన్ని విష‌యాలు బ‌య‌ట‌కు వ‌స్తాయ‌ని చెప్పారు. త‌న పై వారు చేస్తున్న ఆరోప‌ణ‌లు పూర్తీ అవాస్తవ‌మ‌ని అన్నారు. సునీల్ కుమార్ పై ఆయ‌న భార్య గృహ హింస కేసు వేసింద‌ని, ఆయ‌న పై గృహ హింస కేసులో చార్జి షీట్ న‌మోదైంద‌ని అన్నారు.

About Author