NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

చంద్రబాబుకు బెయిల్​..

1 min read

రాయచోటిలో అంబరాన్నంటినసంబరాలు

పల్లెవెలుగు, అన్నమయ్య జిల్లా బ్యూరో: తెలుగుదేశం పార్టీ అధినేత, నవ్యాంధ్ర ఆశాభావం చంద్రబాబు నాయుడు గారిపై వైసీపీ ప్రభుత్వం బనాయించిన అక్రమ కేసులో 53 రోజుల తర్వాత న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు, రాష్ట్ర ప్రజలు ఆనందోత్సాహాలలో మునిగిపోయారు. ఇందులో భాగంగా అన్నమయ్య జిల్లా, రాయచోటి పట్టణం   లోని మండిపల్లి భవన్ వద్ద మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో పండుగ వాతావరణంలో స్వీట్లు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా రాయచోటి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ సైకో ప్రభుత్వం వ్యవస్థలను మేనేజ్ చేస్తూ, చంద్రబాబు బయటికి రాకుండా ఎన్ని కుట్రలు చేసినా నేడు న్యాయమే గెలిచిందని, రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి ఖాయమని, వైసీపీ ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు బనాయించినా, ఎలాంటి ప్రలోభాలకు గురిచేసినా టిడిపి నాయకులు తాటాకు చెప్పుళ్ళుకు భయపడే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ప్రజలు రాబోయే రోజుల్లో వైసిపి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో టిడిపి కార్యకర్తలు  మండిపల్లి  అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

About Author