లాలూకు బెయిల్ !
1 min read
పల్లెవెలుగువెబ్ : ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు డొరండ ట్రెజరీ కేసులో శుక్రవారం బెయిలు మంజూరైంది. దీంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యే అవకాశం లభించింది. ఆయన ఆరోగ్య పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని జార్ఖండ్ హైకోర్టు ఆయనకు బెయిలు మంజూరు చేసింది. నిధుల దుర్వినియోగానికి పాల్పడినందుకు ఆయనకు సీబీఐ కోర్టు శిక్ష విధించిన సంగతి తెలిసిందే.