PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వృద్ధుల సమక్షంలో బైరెడ్డి వేడుకలు

1 min read

– వృద్ధుల సేవలో యాట ఓబులేష్

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: శాప్ చైర్మన్ మరియు రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా కర్నూలు మద్దూర్ నగర్ లో ఉన్న అమ్మ వృద్ధాశ్రమంలో వృద్ధులకు అందరికీ వైఎస్ఆర్సిపి ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాట ఓబులేష్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.ఆశ్రమంలో ఉంటున్న వారందరికీ కూడా మంచి భోజనాన్ని ఆయన ఏర్పాటు చేసి వృద్ధులకు యాట ఓబులేష్ మరియు నందికొట్కూరు నియోజకవర్గం (ఉప్పలదడియ గ్రామం)మైనారిటీ నాయకులు మోమిన్ మన్సూర్ భోజనాలను వారికి ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఇమ్మానుయేలు,శివ,సాయి తదితరులు పాల్గొన్నారు.

About Author