ఐపీవోకు బజాజ్ ఎలక్ట్రానిక్స్
1 min read
పల్లెవెలుగువెబ్: బజాజ్ ఎలక్ట్రానిక్స్ పేరుతో ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్ వినియోగ ఉపకరణాలు విక్రయిస్తున్న ఎలక్ట్రానిక్స్ మార్ట్ ఇండియా లిమిటెడ్ రూ.500 కోట్ల సమీకరణ కోసం పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. అక్టోబరు 5న ప్రారంభం కానున్న ఈ ఐపీఓ అదే నెల 7న ముగుస్తుంది. పబ్లిక్ ఇష్యూ ద్వారా సమీకరించనున్న నిధుల్లో రూ.111.14 కోట్లను వ్యాపార విస్తరణ కోసం వెచ్చించనుండగా రూ.220 కోట్లు వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు, రూ.55 కోట్లను రుణాల చెల్లింపు కోసం కంపెనీ వినియోగించనుంది. ఈఎంఐఎల్ దేశవ్యాప్తంగా వివిధ నగరాలు, పట్టణాల్లో 112 రిటైల్ స్టోర్లు నిర్వహిస్తోంది.