బాల సంజీవిని కొత్త వెర్షన్ 2.0లో తక్షణమే సవరణలు చేయాలి
1 min read
పత్తికొండ, న్యూస్ నేడు : బాల సంజీవని కొత్త వర్షన్ 2.0 లో తక్షణమే సవరణలు చేయాలని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ఏఐటియుసి, సిఐటియు ఆధ్వర్యంలో గురువారం పత్తికొండ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధికారి సిడిపిఓ గారికి మెమొరాండం సమర్పించారు. ఏప్రిల్ ఒకటో తేదీ నుండి రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించి, కొత్త వర్షన్ బాల సంజీవినిలో 2.0 వర్షన్ తెచ్చి, ప్రతిరోజు ఉదయం, వర్కరు హెల్పర్ ఫోటోతో పాటు, ప్రీ స్కూల్ చిన్నారుల ఫోటో తో పాటు15 మాడ్యూల్స్ లో, పనిచేసే విధానాన్ని తెచ్చారు. ఇది ప్రభుత్వం ఇచ్చిన మొబైల్ లో, పనిచేయడానికి సాధ్యం కాని పని అని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులతోపాటుపని చేస్తున్నప్పటికీ, అంగన్వాడి చిన్నారులు, 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల లోపు పిల్లలకు,ఆటపాటలతో పాటు, పిపి1, పి పి 2 సిలబస్ బోధిస్తూ, వండి వడ్డిస్తూ, గర్భవతులకు బాలింతలకు టేక్ హోమ్ రేషన్ఇస్తూ, నిరంతరం ఆధార్ పనులు చేస్తూ, అన్ని డిపార్ట్మెంట్స్ కు సహాయ సహకారాలు అందిస్తూ, నెలనెలా బిల్లులు వేతనాలు సకాలంలో రాకపోయినప్పటికీ, చేతి నుండీ డబ్బులు ఖర్చు పెడుతూ, అంగన్వాడి సెంటర్ లు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. అనేక పర్యాయములు, వేతనాలు పెంచాలని, మినీ టీచర్లను మెయిన్ టీచర్ గా గుర్తించాలని, గ్రాజిడిటీ జీవోను సవరించాలని, సెంటర్ల నిర్వహణకు సంబంధించిన అనేక సమస్యలను నేటికీ పరిష్కరించకపోగా, నేడు బాల సంజీవిని 2.0 వర్షన్ తెచ్చి, తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.తక్షణమే వేతనాలు పెంచి,4GB నెట్వర్క్ తో కూడిన సెల్లులు ఇచ్చి పలు ప్రధానమైన సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు. లేనియెడల భవిష్యత్తులో పెద్ద ఎత్తున అంగన్వాడీల ఉద్యమాన్ని తీసుకొస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.