NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బాల‌కృష్ణ భావోద్వేగం !

1 min read

పల్లెవెలుగు వెబ్​: ప్రముఖ న‌టుడు నంద‌మూరి బాల‌కృష్ణ భావోద్వేగానికి గుర‌య్యారు. త‌న తండ్రి ఎన్టీఆర్ గురించి త‌ల‌చుకుని ఆయ‌న ఒక్కసారిగా ఎమోష‌న‌ల్ అయ్యారు. ఆహా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోన్న `అన్ స్టాప‌బుల్` కార్యక్రమంలో `అఖండ‌` మూవీ టీమ్ తో ఆయ‌న షో చేశారు. ఈ సంద‌ర్భంగా ద‌ర్శకుడు బోయ‌పాటి శీను, ప్రముఖ న‌టుడు శ్రీకాంత్, హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్, మ్యూజిక్ డైరెక్టర్ త‌మ‌న్ షోలో సంద‌డి చేశారు. ఈ సంద‌ర్భంగా బాల‌కృష్ణ త‌న తండ్రి నంద‌మూరి తార‌క రామారావును గుర్తు చేసుకున్నారు. వెన్నుపోటు అంటూ అప్పట్లో తప్పుడు ప్రచారం చేశార‌ని అన్నారు. దాని గురించి చెబుతుంటే క‌ళ్లల్లో నీళ్లు వ‌స్తాయ‌ని.. ఎందుకంటే తాను ఆయ‌న కొడుకుల్లో ఒక‌డిని, ఆయ‌న అభిమానుల్లో ఒక‌డిని అని అన్నారు.

About Author