PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బాల‌కృష్ణ ఓ ఆటంబాంబు.. ఎలా వాడాలో ఆయ‌న‌కే తెలుసు !

1 min read

పల్లెవెలుగు వెబ్​:నందమూరి బాల‌కృష్ణ ఆటంబాంబు లాంటి వార‌ని .. ఆయ‌న్ని ఎలా వాడాలో ద‌ర్శ‌కుడు బోయపాటి శ్రీనుకే తెలుస‌ని అన్నారు ద‌ర్శ‌కధీరుడు రాజ‌మౌళి. బాల‌కృష్ణ క‌థానాయ‌కుడిగా న‌టించిన `అఖండ‌` సినిమా ప్రీరిలీజ్ వేడుక హైద‌రాబాద్ లో ఘ‌నంగా జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి డ్యూయెట్ ను విడుద‌ల చేశారు. బోయ‌పాటి శ్రీను ఈ ఆడిటోరియానికే కాకుండా.. మొత్తం ఇండ‌స్రీకే ఊపు తెచ్చిన ద‌ర్శ‌కుడ‌ని రాజమౌళి అభిప్రాయం వ్య‌క్తం చేశారు. డిసెంబ‌ర్ 2తో మొద‌ల‌య్య థియేట‌ర్ల‌న్నీ ప్రేక్ష‌కుల‌తో నిండిపోవాల‌ని కోరారు. బాల‌య్య బాబును ఎలా వాడాలో బోయ‌పాటి శ్రీనుకే తెలుసని అన్నారు. ఆ సీక్రెట్ ఏంటో అంద‌రికీ చెప్పాల‌ని అన్నారు. అంద‌రిలానే తాను కూడ అఖండ‌ను థియేట‌ర్లో చూడాల‌ని అనుకుంటున్న‌ట్టు ఆయ‌న తెలిపారు.

About Author