అంగన్వాడీ కేంద్రంలో ఉండే ప్రతి పిల్లవాడికి బాలామృతం తినిపించాలి
1 min read– గర్భవతులు చిరుధాన్యాలు తీసుకోవాలి: సిడిపిఓ సావిత్రి దేవి
పల్లెవెలుగు వెబ్ గోనెగండ్ల: మండల కేంద్రమైన గోనెగండ్ల లోని మూడవ అంగన్వాడి కేంద్రం నందు పోషణ పక్వాడ కార్యక్రమంలో భాగంగా సిడిపిఓ సావిత్రి దేవి, సూపర్వైజర్ నాగేశ్వరమ్మ ఆధ్వర్యంలో చిరుధాన్యాల ప్రాముఖ్యత బాలమృతం వినియోగం గురించి గర్భిణీలకు వివరించారు. అంగన్వాడి సెంటర్ వర్కర్స్ అంగన్వ వాడిలో బాలామృతంతో లడ్డు చేయించి పిల్లలకు తినిపించారు.గర్భిణీలు చిరుధాన్యాలు తినడం వల్ల రక్తం పెరిగి ప్రచురించే సమయంలో ఇబ్బందులు లేకుండా ఉండాలంటే కచ్చితంగా గర్భిణీలు చిరుధాన్యాలు తినాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు,మహిళా పోలీసులు, గర్భవతులు ,బాలింతలు పిల్లలు తదితరులు పాల్గొన్నారు.