నియోజకవర్గంలో అభివృద్ధి జరగాలంటే బాలనాగిరెడ్డి ని ఓడించాలి
1 min readటిడిపి అభ్యర్థులను గెలిపించే బాధ్యత పాలకుర్తి తిక్కా రెడ్డి గారిదే
మంత్రాలయం టిడిపి అభ్యర్థి మాధవరం రాఘవేంద్ర రెడ్డి
చంద్రబాబు నమ్మకాన్ని వమ్ము చేయను
జిల్లా టీడీపీ అధ్యక్షుడు తిక్కారెడ్డి
పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం : మంత్రాలయం నియోజకవర్గం అభివృద్ధి జరగాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి బాలనాగిరెడ్డి ని మంత్రాలయం టిడిపి అభ్యర్థి మాధవరం రాఘవేంద్ర రెడ్డి అన్నారు. సోమవారం మంత్రాలయం టిడిపి కార్యాలయంలో నూతనంగా కర్నూలు పార్లమెంటు జిల్లా అధ్యక్షులు గా ఎన్నికైన పాలకుర్తి తిక్కారెడ్డి ని పూలమాలలు వేసి శాలువ కప్పి స్వీట్ తినిపించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలనాగిరెడ్డి ని ఓడించాలంటే కార్యకర్తలు బీసీలు అంత ఐకమత్యంతో కలిసి దృఢ సంకల్పంతో పని చేయాలని సూచించారు. ఇందుకు వైకాపా పార్టీ వాళ్ళను ఆహ్వానించి కలుపుకొని మరింతగా పనిచేసి తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేసి అధికారంలోకి తీసుకువస్తామని ధీమా వ్యక్తం చేశారు. పాలకుర్తి తిక్కారెడ్డి, రాఘవేంద్ర రెడ్డి ఇద్దరు కలిస్తే గేలవడం ఖాయమని అన్నారు. ఇద్దరు కలయిక తో మంత్రాలయం నియోజకవర్గం ను ఒక ఊపు ఊపుతామని అన్నారు. మంత్రాలయం నియోజకవర్గo ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డి ని భారీ మెజార్టీతో గెలిపించే బాధ్యత పాలకుర్తి తిక్కారెడ్డి దే అని అన్నారు. అలాగే ఈరోజు నుంచే మంత్రాలయం నియోజకవర్గం లో ఆట మొదలవుతుందని తిక్కా రెడ్డి రాఘవేంద్ర రెడ్డి ఇద్దరు కలిసి సూపర్ సిక్స్ తో ప్రజల దగ్గరకు వెళ్లి విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, కార్యకర్తలు, మరియు ప్రతి ఒక్కరు అన్నదమ్ముల కలిసి పోరాడి తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం తిక్కారెడ్డి మాట్లాడుతూ మంత్రాలయం టిడిపి టికెట్ రాలేదని బాధపడుతున్న నన్ను కర్నూలు పార్లమెంటు జిల్లా అధ్యక్షులు గా నియమించడం ఆనందంగా ఉందన్నారు. తిక్కారెడ్డి అయితే జిల్లాలో ఏడు నియోజకవర్గాల ఎమ్మెల్యేల అభ్యర్థులను గెలిపించాలని నాపై పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయను అన్నారు. బాలనాగిరెడ్డి ని ఓడించేందుకు కార్యకర్తలు ఐక్యంగా ఉండి సైకిల్ గుర్తు పై ఓటు వేసి రాఘవేంద్ర రెడ్డి ని ఎమ్మెల్యే గా గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పన్నగా వెంకటేశ్వర్ల స్వామి, అడివప్ప గౌడ్, వెంకటపతి రాజు, కోటేష్ గౌడ్, ఎల్లారెడ్డి,టిప్పు సుల్తాన్, నడిగేని అయ్యన్న, చిన్న బొంపల్లి నరసింహులు, కృష్ణారెడ్డి, మహాదేవ, విజయరామరెడ్డి, ఏబు, రామకృష్ణ, నాగరాజు, బీమా,తిక్క స్వామి గౌడ్,రవికుమార్, ఐ టీడీపీ సభ్యులు నాగేష్ నీలకంఠ చిదానంద తదితరులు పాల్గొన్నారు.