PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బలరామ పౌర్ణమి ఉత్సవాలు

1 min read

పల్లెవెలుగు వెబ్  చెన్నూరు:  చెన్నూరు మండలం కొండపేట గ్రామంలో వెలిసిన అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం .ఇస్కాన్. వారి ఆధ్వర్యంలో గురువారం బలరామ పౌర్ణమి ఉత్సవాలు నిర్వహించేందుకు ఇస్కాన్ భక్తులు అన్ని ఏర్పాట్లు చేశారు. కొండపేట గ్రామంలోని ఇస్కాన్ భజన మందిరంలో ఉదయం 4.30. గంటల నుండి మంగళహారతి. ఉదయం5.30. గంటల నుండి7.30. వరకు నిర్వహిస్తున్నారు. ఉదయం8.30 గంటల నుండి11.15 గంటల వరకు భజన. కీర్తన. కథ నిర్వహిస్తున్నారు. ఉదయం11.15 గంటల నుంచి శంఖాభిషేకం ఏర్పాటు చేశారు. ఉదయం11.40 గంటల వరకు పుష్పాభిషేకం మధ్యాహ్నం12.00 గంటలకు పంచహారతి ఏర్పాటు చేశారు. బలరామకృష్ణులకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం12.15 గంటలకు భక్తులకు ఉచిత అన్నదాన మహా ప్రసాద వితరణ ఏర్పాటు చేశారు. సాయంత్రం4.30. గంటల నుండి కొండపేట పురవీధుల గుండా బలరామకృష్ణులతో కూడిన ఉత్సవ విగ్రహాలను నగర సంకీర్తన నిర్వహించే ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి చెన్నూరు మండలం నుంచి కాకుండా కడప. ప్రొద్దుటూరు మైదుకూరు. కాజీపేట. ప్రాంతాల నుంచి భారీ ఎత్తున ఇస్తాను భక్తులు హాజరవుతున్నారు.

About Author