PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

`బింబిసార‌` పై బాల‌య్య పొగ‌డ్త‌లు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : నందమూరి కల్యాణ్‌రామ్‌ తాజాగా నటించిన చిత్రం ‘బింబిసార’. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమా మొదటి నుంచి పాజిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకొని బాక్సాఫీస్‌ వద్ద అదిరిపోయే కలెక్షన్లను రాబట్టింది. తాజాగా నందమూరి బాలకృష్ణ యూనిట్‌ సభ్యులతో కలిసి ఈ సినిమాను వీక్షించారు. అనంతరం అనంతరం మూవీ టీంని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. కల్యాణ్‌రామ్‌ నటనపై ఆయన ప్రశంసలు కురిపించారు. బాల‌కృష్ణ‌తో పాటు క‌ళ్యాణ్‌రామ్ సోద‌రి సుహాసిని, భార్య స్వాతి కూడా బింబిసార చిత్రాన్ని చూశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

                                       

About Author