PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బ‌లిసి కొట్టుకుంటుంది మీరే.. మేం కాదు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : సినిమా టికెట్ ధ‌ర‌ల అంశం పై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన వైకాపా ఎమ్మెల్యే న‌ల్ల‌పురెడ్డి ప్ర‌స‌న్న‌కుమార్ రెడ్డి పై నిర్మాత ఎన్వీ ప్ర‌సాద్ ఫైర్ అయ్యారు. మీడియా ముందు మాట్లాడితే హీరో అవుతామ‌ని అనుకుంటున్నార‌ని, బ‌లిసి కొట్టుకుంటుంది మీరేన‌ని వ్యాఖ్యానించారు. నల్లపు రెడ్డి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సినిమావాళ్లు బలిసి కొట్టుకుంటున్నారని మాట్లాడారని, ఇది ఆయనకే వర్తిస్తుందని అన్నారు. ఇక్కడ ఎవరూ బలిసి కొట్టుకోవడంలేదన్నారు. సినిమాలో నటించాలంటే వంద అడుగుల రోప్ కట్టుకుని, రోప్‌పైకి ఎక్కి వంద అడుగులు దూకితే.. ఎవరు బలసి కొట్టుకుంటున్నారో తెలుస్తుందన్నారు. సినిమా నిర్మాణం ఎంత కష్టమో తెలియాలంటే తన సినిమా నిర్మాణం దగ్గరకు ప్రసన్నకుమార్ రెడ్డి వచ్చి చూడాలని అన్నారు. తిరుపతిలో జ‌రిగిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు.

                                          

About Author