8 లక్షల యాప్ లపై నిషేధం !
1 min readపల్లెవెలుగు వెబ్ : గూగుల్ ప్లేస్టోర్ నుంచి, ఆపిల్ యాప్ స్టోర్ నుంచి 8 లక్షల యాప్ లపై నిషేధం విధించారు. పిక్సలేట్ అనే సైబర్ సెక్యూరిటీ సంస్థ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ‘ హెచ్1 2021 డీలిస్టెడ్ మొబైల్ యాప్స్ రిపోర్ట్ ’ పేరుతో పిక్సలేట్ ఓ నివేదిక రూపొందించింది. ఈ నివేదికలో హానికరమైన, మోసపూరిత 8,13,000 యాప్ లను పొందుపరిచింది. ఈ యాప్ లు కెమెరా, జీపీఎస్ ద్వార విలువైన సమాచారాన్ని సేకరిస్తున్నట్టు నివేదికలో పేర్కొంది. వీటిలో 86 శాతం యాప్ లు 12 ఏళ్ల పిల్లలే లక్ష్యంగా సైబర్ దాడికి పాల్పడుతున్నట్టు నివేదికలో పేర్కొంది.