పీఎఫ్ఐ నిషేధం సరికాదు
1 min readపల్లెవెలుగువెబ్: పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాపై కేంద్రం నిషేధం విధించడంపై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. నేరానికి పాల్పడే కొంతమంది వ్యక్తుల చర్యల వల్ల సంస్థను నిషేధించాలని కాదన్నారు. ఒకరిని దోషిగా నిర్ధారించడానికి కేవలం ఒక సంస్థతో అనుబంధం మాత్రమే సరిపోదని సుప్రీంకోర్టు కూడా అభిప్రాయపడిందని ఆయన గుర్తు చేశారు. తాను ఎల్లప్పుడూ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా విధానాలను వ్యతిరేకిస్తూనే ఉన్నానని ఒవైసీ చెప్పుకొచ్చారు. ప్రజాస్వామ్య విధానాన్ని సమర్ధిస్తున్నప్పటికీ, పీఎఫ్‌ఐపై నిషేధానికి మద్దతు ఇవ్వలేనన్నారు. ఈ రకమైన నిషేధం ప్రమాదకరమని చెప్పారు.