బనగానపల్లె ఎంపీడీవో నాగప్రసాద్ సస్పెన్షన్
1 min readఎంపిడివోగా ఈవోపీఆర్డీ శివరామయ్యకు పూర్తిస్థాయి బాధ్యతలు
పల్లెవెలుగు వెబ్, బనగానపల్లె : కర్నూలు జిల్లా బనగానపల్లె మండలంలో ఎంపిడివో నాగప్రసాద్ ను సస్పెండ్ చేస్తూ జిల్లాపరిషత్ సీఈఓ వెంకటసుబ్బయ్య గురువారం ఉత్తర్వులు జారీచేశారు. మండలంలోని ఎర్రగుడి గ్రామ ఉపసర్పంచ్ పదవి ఎన్నిక విషయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడి ఆ గ్రామ ఉప సర్పంచ్ పదవికి ఎన్నిక నిర్వహించకుండానే ఎన్నికైనట్లు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. దీనితో టీడీపీ మద్దతుదారుడు ఆ గ్రామ సర్పంచ్ దోనపాటి భాస్కరరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. విచారణలో ఎంపిడివో ఏకపక్ష నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడికావడంతో తీర్పు సర్పంచుకు అనుకూలంగా వచ్చింది. దీంతో విచారణ అనంతరం న్యాయస్థానం పంచాయతీ రాజ్ కమిషనర్‌ను ఆదేశించడంతో ఎంపిడివో నాగప్రసాద్ సస్పెండయ్యారు. అదేసమయంలో బనగానపల్లె ఈవోఆర్డీ గా విధులు నిర్వహిస్తున్న శివరామయ్యకు ఎంపిడివోగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈవోపీఆర్డీ శివరామయ్యకు ఎంపిడివోగా అదనపు బాధ్యతలు
బనగానపల్లె ఎంపిడివో నాగప్రసాద్ సస్పెండ్ కావడంతో ఆయన స్థానంలో ఎంపిడివోగా ఈవో పిఆర్డీ శివరామయ్యకు పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు కలిపిస్తూ జిల్లా పరిషత్ సిఈవో శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏ. శివ రామయ్య, EO (PR & RD) తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు మండలంలో పరిపాలన సజావుగా సాగేందుకు తన సాధారణ విధులతో పాటు మండల పరిషత్ అభివృద్ధి అధికారి, మండల ప్రజా పరిషత్, బనగానపల్లి పోస్టుకు పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.