ఆరు రోజుల్లో నాలుగు రోజులు బంద్ !
1 min readపల్లెవెలుగువెబ్ : వివిధ కారణాల వల్ల వచ్చే ఆరు రోజుల్లో 4 రోజులకు బ్యాంకులు పనిచేయవు. మార్చి 26 నుంచి ఏప్రిల్ 3 మధ్య బ్యాంకులు నాలుగు రోజుల పాటే పనిచేయనున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేట్ పరం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగుతున్నారు. మార్చి 28, 29 (సోమ, మంగళ ) వారాల్లో రెండు రోజుల సమ్మెను ఇండియన్ బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్లు ప్రకటించాయి. బ్యాంకు ఉద్యోగుల సమ్మె తరువాత కేవలం రెండు రోజుల పాటు మాత్రమే బ్యాంకులు నడవనున్నాయి. మార్చి 30, 31 రోజున బ్యాంకులు యథావిధిగా తమ కార్యకలాపాలను జరపనున్నాయి.ఏప్రిల్ 1 న అన్యువల్ క్లోజింగ్ కావడంతో బ్యాంకులు పనిచేయవు. ఏప్రిల్ 2 న తెలుగు రాష్ట్రాల్లో ఉగాది సందర్భంగా బ్యాంకులకు సెలవు. దీంతో ఆయా రోజుల్లో బ్యాంకు కార్యకలాపాలపై ప్రభావం పడనుంది.