PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఈ నెల 8న కేజీ నుండి పీజి వరకు రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలు బంద్

1 min read

– విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణకై కడపలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణంకై రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలు బంద్. పిలుపునివ్వడం జరిగింది. ఏఐఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ_ స్థానిక హోళగుంద మండల కేంద్రం నందు తనూజ డిగ్రీ కళాశాలలో సోమవారం రోజు బంద్ కు సంబంధించిన గోడపత్రికలను విడుదల చేయడం జరిగింది.

పల్లెవెలుగు వెబ్ హొళగుంద  : ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీరంగ ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి మల్లికార్జున ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి సతీష్ కుమార్ మాట్లాడుతూ_* విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకై 32 మంది ప్రాణత్యాగాలతో ఏర్పడి సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణకు పూనుకోవడం అత్యంత దారుణం అన్నారు. కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విరమించుకోవాలని వారు అన్నారు.62 మంది వామపక్ష ఎమ్మెల్యేలు వారి పదవికి రాజీనామా చేసి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి కీలకపాత్ర వహించారని వారు తెలిపారు. అటువంటి ఫ్యాక్టరీని బిజెపి అధికారంలోకి వచ్చాక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేసి ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు విశాఖ స్టీల్ ప్లాంట్ లో ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారుగా లక్ష మందికి పైగా ఉపాధి లభిస్తుంది అని వారన్నారు. ఉత్పత్తిలో విశాఖ స్టీల్ ప్లాంట్ మంచి లాభాలు ఘటిస్తున్న సమయంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించడం అత్యంత దారుణమని తెలిపారు ఇప్పటికైనా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని వివిధ ప్రజా సంఘాలు విద్యార్థి యువజన సంఘాలు వామపక్ష పార్టీలు ప్లాంట్ ఉద్యోగులు వివిధ ట్రేడ్ యూనియన్ నాయకులు కార్మికులు చేపట్టిన దీక్ష నవంబర్ 8వ తేదీ నాటికి 1000 రోజులుగా నిరసన దీక్షలు చేపట్టాయని. వారు తెలియజేశారు. అయినా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విరమించుకోవాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో అత్యంత వెనుకబడిన రాయలసీమ కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం కోసం హామీ ఇచ్చిన.మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన పనులు చేసినప్పటికీ ప్రస్తుత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిరెండుసార్లు శంకుస్థాపన చేసి ఉక్కు పరిశ్రమ నిర్మాణ కోసం ఒక్క పైసా కూడా నిధులు కేటాయించలేదు లక్ష మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కాపాడుకుంటూ కడపలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టాలని ప్రధానమైన డిమాండ్ల కోసం జరుగుతున్న ఈ బంద్ కు పెద్ద ఎత్తున విద్యార్థులు యువకులు కార్మికులు వివిధ పార్టీ నాయకులు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని బందును జయప్రదం చేయవలసిందిగా వారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు మంజు రవి దివాకర్ మల్లి విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

About Author