PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నంద్యాలలో విద్యాసంస్ధల బంద్ విజయవంతం

1 min read

పల్లెవెలుగు వెబ్ నంద్యాల: బంద్ కార్యక్రమానికి విశేష స్పందన , ఉదయం నుండే దాదాపు అన్ని విద్యాసంస్ధలు స్వఛ్చందంగా బందు పాటిస్తున్న వైనం.ఉదయం 6 గంటల నుండే బందులో పాల్గొన్న విద్యార్ధి , యువజన నేతలు.*విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వెంటనే ఆపాలి.కడప స్టీల్ ప్లాంట్ ను తక్షణమే ప్రారంభించాలి.AIYF , AIYL , AISB , SFI , AISA , DYFI , PDSU నేతలు.విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణను ఆపాలని , కడప స్టీల్ ప్లాంటు నిర్మాణం తక్షణమే ప్రారంభించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్ధి , యువజన , ప్రజా సంఘాలు ఇచ్చిన బంద్ పిలుపు మేరకు నేడు నంద్యాలలో వివిధ సంఘాల ఆధ్వర్యంలో ఉదయం 6 గంటల నుండే బంద్ కార్యక్రమం మొదలైందీ , దాదాపు అన్ని విద్యాసంస్ధలు బందుకు మద్దతుగా స్వఛ్చందంగా సెలవు ప్రకటించారు.కొన్ని చోట్ల నేతలు బస్సులు ఆపి నిరసన తెలియజేశారు.ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగరాముడు , ఏఐవైఎల్ రాష్ట్ర కార్యదర్శి రామినేని రాజునాయుడు , ఎస్ఎఫ్ఐ డివిజన్ సహాయ కార్యదర్శి మధుకిరణ్  , పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు రాంబాబు , డీవైఎఫ్ఐ నంద్యాల పట్టణ కార్యదర్శి శివ , ఏఐఎస్ఏ జిల్లా కార్యదర్శి నాగార్జున , ఎ.ఐ.ఎస్.బి జిల్లా ప్రధాన కార్యదర్శి తెలుగు మహేష్ , సమాజ్ వాదీ పార్టీ జిల్లా అధ్యక్షులు పెరుగు శివకృష్ణ యాదవ్ తదితరులు మాట్లాడారు.

About Author