‘బండి సంజయ్.. హద్దులు దాటొద్దు’..!
1 min readపల్లెవెలుగు వెబ్: తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ హద్దు మీరి మాట్లాడుతున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కొన్నింటికి హద్దులుంటాయని, హద్దులు మీరి మాట్లాడితే అసభ్యకరంగా ఉంటుందన్నారు. బాధ్యతగా వ్యవహరించాలని హితవు పలికారు. కరోన కట్టడి విషయంలో రాష్ట్రానికి కేంద్రం ఏం చేస్తుందో చెప్పాలని ప్రశ్నించారు. గత ఏడాది ప్రధాని చెప్పిన పనులన్ని రాష్ట్ర ప్రభుత్వం చేసిందని, నిజాలు తెలుసుకని బండి సంజయ్ మాట్లాడాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హితవు పలికారు.