నేపాలి పాపను దత్తత తీసుకున్న బండ్ల గణేష్
1 min readపల్లెవెలుగు వెబ్: ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ నిత్యం ఏదో రకంగా వార్తల్లో ఉంటారు. ఈ సారి మాత్రం ఎలాంటి వివాదస్పద వ్యాఖ్యలు లేకుండానే వార్తల్లో నిలిచారు. బండ్ల గణేష్ ఓ నేపాలి పాపను దత్తత తీసుకున్నాడు. ఈ విషయంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తాను ఓ నేపాలీ పాపని పెంచుకుంటున్నట్లు పేర్కొన్నాడు. అందరూ కుక్కలు, పిల్లులు పెంచుకొని వాటికి చాలా డబ్బు ఖర్చు పెడుతుంటారని, తాను మాత్రం ఈ పాపను పెంచుకొని, గొప్పగా చదివించాలనుకంటున్నట్లు తెలిపాడు. ఇప్పుడు ఆ పాప తమ కుటుంబ సభ్యురాలు అయిపోయిందని, తమను బెదిరించే స్థాయికి వచ్చిందని ఫన్నీగా పేర్కొన్నాడు. బండ్ల గణేష్ దాతృత్వానికి పలువురు అభినందనలు తెలిపారు.