చిరంజీవి వ్యాఖ్యల పై బండ్ల గణేష్ స్పందన !
1 min readపల్లెవెలుగువెబ్ : ఇండస్ట్రీ పెద్దగా తాను ఉండనంటూ.. ఆ హోదా తనకు అస్సలు ఇష్టం లేదంటూ మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై నిర్మాత, నటుడు బండ్ల గణేష్ స్పందించారు. చిరు వ్యాఖ్యలను బండ్ల గణేష్ సమర్థించారు. ‘సూపర్ సర్’ అంటూ తన ట్విటర్ అకౌంట్లో షేర్ చేశారు. ఆయన మాటలను రిపీట్ చేస్తూ ఈ ట్వీట్ చేశాడు బండ్ల గణేష్. అయితే ‘మా’ ఎన్నికల తర్వాత సినీ పరిశ్రమలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో చిరంజీవి ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారాయి.