PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బంగార్రాజు వస్తాడంట..

1 min read

సినిమా డెస్క్​ : ఈ యేడు అక్కినేని నాగార్జున నటించిన ‘వైల్డ్‌ డాగ్‌’ సూపర్‌‌ హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. దీనికంటే ముందే నాగార్జున నటిస్తున్న బాలీవుడ్ చిత్రం ‘బ్రహ్మాస్త్ర’ రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఈ లోపు నాగ్‌ ‘సోగ్గాడే చిన్నినాయనా’ ప్రీక్వెల్‌ ‘బంగార్రాజు’ మూవీని పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు. రెండేళ్ల నుంచి ఈ సినిమా చేస్తారా.. చెయ్యరా అన్న డైలమాలో ఉన్న టీమ్‌ రీసెంట్‌గా ఈ మూవీ చేస్తున్నామని ప్రకటించింది. దీనికి కల్యాణ్‌కృష్ణ కురసాల దర్శకత్వం వహిస్తున్నాడు. నాగ్‌కి జోడీగా రమ్యకృష్ణ నటిస్తున్నారు. ఇందులో నాగచైతన్య పాత్ర కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందట. చైతు పాత్రకి జోడీగా కృతి శెట్టిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. కాగా, ఈ సినిమా షూటింగ్ ఆగస్టు మూడో వారం నుంచి చిత్రీకరణ షురూ చేయనున్నట్టు సమాచారం. హైదరాబాద్‌లో ప్రత్యేకంగా ఓ సెట్‌ కూడా వేస్తున్నారట. ఈ చిత్ర కథ పల్లెటూరి బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందనీ, సంక్రాంతికి ఈ సినిమా తీసుకురావాలని నాగ్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

About Author