NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

టిడిపిలో చేరిన బంగారుపేట ప్ర‌జ‌లు

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: క‌ర్నూలు న‌గ‌రంలోని 13వ వార్డు బంగారుపేటకు చెందిన ప్ర‌జ‌లు క‌ర్నూలు నియోజ‌క‌వ‌ర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భ‌ర‌త్ స‌మ‌క్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. టిడిపి నేత‌లు సురేష్‌, శ్రీనివాస రెడ్డి ఆధ్వ‌ర్యంలో హుసేన్ ఖాన్‌, షేర్ ఖాన్‌, మెహబూబ్ ఖాన్, రియాజ్ ఖాన్ కుటుంబాలు టిడిపిలో చేరాయి. టి.జి భ‌ర‌త్ వీరికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సంద‌ర్భంగా టిడిపికి మ‌ద్ద‌తిచ్చి పార్టీలో చేరిన వారికి టి.జి భ‌ర‌త్ ధ‌న్య‌వాదాలు తెలిపారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీ గెలుపు కోసం క‌ష్ట‌ప‌డాల‌ని చెప్పారు. క‌ర్నూల్లో త‌న గెలుపుతో న‌గ‌రంలో ప్ర‌తి ఒక్క‌రికీ మేలు జ‌రుగుతుంద‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో వార్డు నేత‌లు శ్రీనివాసులు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

About Author