సమ్మె బాటలో బ్యాంకు ఉద్యోగులు.. బ్యాంకులు పనిచేస్తాయా ?
1 min readపల్లెవెలుగు వెబ్: బ్యాంకు యూనియన్లు సమ్మెబాట పట్టాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ మేరకు సమ్మె నోటీసులు కూడ ఇచ్చాయి. కేంద్ర ప్రభుత్వం 1.79 లక్షల కోట్ల పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేటుపరం చేయాలని నిర్ణయించింది. దీనిని నిరసిస్తూ బ్యాంకు యూనియన్లు సమ్మెబాట పట్టాయి. గడిచిన నాలుగు సంవత్సరాల్లో 14 ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీన ప్రక్రియను కూడా కేంద్రం విజయవంతంగా పూర్తి చేసింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో తమ వాటాను 26 శాతానికి తగ్గించుకోవడానికి వెసులు బాటు కల్పించడానికి ఉద్దేశించి బిల్లును కేంద్రం సిద్ధం చేసింది. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ప్రవేశపెట్టడానికి వీలుగా బ్యాంకింగ్ చట్ట (సవరణ) బిల్లును కేంద్రం లిస్ట్ చేసింది. దీనిని వ్యతిరేకిస్తూ సమ్మె బాట పట్టినట్టు బ్యాంకు యూనియన్లు ప్రకటించాయి.
ReplyForward |